అపర కుబేరుడు అదానీ
Published: Wed, 20 Jul 2022 02:09:56 IST హోం జాతీయం అపర కుబేరుడు అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోకి బిల్ గేట్స్‌ను కూడా దాటేసి నాలుగో స్థానానికి ఈ జాబితాలో పదో స్థానంలో ముకేశ్ అంబానీ ఆర్థిక సంస్కరణలతో వేగంగా వ్యాపార విస్తరణ మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి స్నేహం ఆయన ప్రధాని అయ్యాక విస్తరించిన అదానీ సామ్రాజ్యం ఐ శ్వర్యం గురించి చెప్పాలంటే ఒకప్పుడు టాటా, బిర్లాల గురించి చెప్పేవాళ్లు. ఇప్పుడా స్థానాన్ని అంబానీ, అదానీ ఆక్రమించారు. ఈ ఇద్దరిలోనూ చాలాకాలంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీదే పైచేయిగా ఉండేది. తాజాగా.. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ అక్షరాలా 9.22 లక్షల కోట్ల రూపాయల సంపదతో నాలుగో స్థానం సాధించారు. రూ.7 లక్షల కోట్లతో అంబానీ పదోస్థానంలో ఉండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన సంపదలో 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడంతో ఆయన ఐదో స్థానానికి పరిమితమయ్యారు. రూ.18.5 లక్షల కోట్లతో ఈలన్ మస్క్, రూ.12.37 లక్షల కోట్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్, రూ.11.42 లక్షల కోట్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్...