Adani Group shares: అదానీ రుణ పత్రాలకు రేటింగ్‌ ప్రాతిపదిక ఏమిటి?

 Adani Group shares: అదానీ రుణ పత్రాలకు రేటింగ్‌ ప్రాతిపదిక ఏమిటి?

ABN , First Publish Date - 2023-02-23T08:15:52+05:30 IST


స్టాక్‌మార్కెట్‌పై ‘బేర్‌’ పంజా అదానీ గ్రూప్‌ షేర్లను మరింత దెబ్బతీసింది. ఈ కంపెనీల పరపతి రేటింగ్‌పై సెబీ


Adani Group shares: అదానీ రుణ పత్రాలకు రేటింగ్‌ ప్రాతిపదిక ఏమిటి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం.

సం|| 9393 763 666


రేటింగ్‌ ఏజెన్సీలకు సెబీ ప్రశ్న


ఇన్వెస్టర్ల బెంబేలు


మార్కెట్‌లో ‘బేర్‌’మన్న షేర్లు



Powered By

VDO.AI

PauseUnmute

Fullscreen

ఒకే రోజు రూ.51,000 కోట్లు హాంఫట్‌


ముంబై: స్టాక్‌మార్కెట్‌పై ‘బేర్‌’ పంజా అదానీ గ్రూప్‌ షేర్లను మరింత దెబ్బతీసింది. ఈ కంపెనీల పరపతి రేటింగ్‌పై సెబీ దృష్టి పెట్టడం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. ఏ ప్రాతిపదికన వాటి రుణ పత్రాలకు పరపతి రేటింగ్స్‌ ఇచ్చారో తెలపాలని రేటింగ్‌ ఏజెన్సీలను సెబీ కోరింది. దీంతో అదానీ గ్రూప్‌-రేటింగ్‌ సంస్థల మధ్య ఉన్న సంబంధాలూ బయటపడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో ఏ మ్రాతం ప్రతికూల విషయాలు బయట పడినా, అదానీ గ్రూప్‌ మరిన్ని చిక్కుల్లో పడుతుందని భావిస్తున్నారు.


కుదేలైన షేర్లు: సెబీ ఆదేశాల నేపథ్యంలో మదుపరులు భారీ ఎత్తున అమ్మకాలకు దిగడంతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల షేర్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఒక్కరోజులోనే ఈ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ రూ.51,294.04 కోట్లు క్షీణించి రూ.7.55 లక్షల కోట్లకు చేరింది. జనవరి 24 నుంచి ఇప్పటి వరకు అదానీ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.11.62 లక్షల కోట్లు తరిగిపోయింది. గత ఏడాది ఒక దశలో ఈ విలువ దాదాపు రూ.25 లక్షల కోట్లుండేది. ఇపుడది 70 శాతం తరిగి పోయి రూ.7.55 లక్షల కోట్లకు చేరింది. జనవరి 24 నాటికి ఉన్న రూ..19,19,888 కోట్లతో పోల్చినా, మార్కెట్‌క్యాప్‌ రూ.11,64,888 కోట్లు తుడిచిపెట్టుకు పోయింది. దేశ జీడీపీలో ఇది దాదాపు 4.22 శాతానికి సమానం.


పెన్షన్‌ ఫండ్స్‌ లబోదిబో: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో మదుపు చేసిన విదేశీ పెన్షన్‌ ఫండ్‌ సంస్థలూ ఇపుడు లబోదిబోమంటున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్యూచర్‌ ఫండ్‌, ఆస్ట్రేలియన్‌ రిటైర్‌మెంట్‌ ట్రస్టు వంటి పెన్షన్‌ ఫండ్‌ సంస్థలు ఈ కంపెనీల షేర్లలో పెద్ద మొత్తంలో మదుపు చేశాయి. పీకల్లోతు అప్పుల్లో ఉన్న అదానీ గ్రూప్‌ షేర్లలో ఎలా మదుపు చేశారని, మదుపరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫండ్‌ మేనేజర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.


ఏఈఎల్‌ కేసు ఇపుడే విచారించాలా?


అదానీ గ్రూప్‌ కంపెనీలపై నమోదైన కేసుల నత్త నడకపై న్యాయస్థానాలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు ఈ కేసులపై ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి, ఇపుడు తొందరపడడంపై ఎకసెక్కంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌పై ఎపుడో 2012లో నమోదైన మార్కెట్‌ అక్రమాల కేసు విచారణను తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎస్‌ఎ్‌ఫఐఓ ఇపుడు కోరడంపై బుధవారం బొంబాయి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘బయటి పరిస్థితుల నేపథ్యం’లో ఇపుడే ఈ కేసు గుర్తుకు వచ్చిందా?’ అని న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌జీ అవచట్‌ ఎస్‌ఎ్‌ఫఐఓను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎపుడో 2019లో నమోదైన ఈ కేసు బుధవారం విచారణకు వస్తుందనే విషయం తమకు తెలియదని, విచారణ వాయిదా వేసి, తుది విచారణకు తేదీని నిర్ణయించాలని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తరఫు సీనియర్‌ లాయర్‌ అమిత్‌ దేశాయ్‌ న్యాయస్థానాన్ని కోరారు. దాంతో ఎస్‌ఎ్‌ఫఐఓను ఉద్దేశించి న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2023-02-23T08:15:52+05:30 IST

Comments

Popular posts from this blog

Crypto Newbies Have Family And Friends To Thank For Losses

Reliance Jio Tops 5G Spectrum Bids With ₹ 88,078 Crore,

అపర కుబేరుడు అదానీ