కరోనా ఎఫెక్ట్: భారత్‌లో మరింత పెరిగిన రికవరీ రేట్

కరోనా ఎఫెక్ట్: భారత్‌లో మరింత పెరిగిన రికవరీ రేట్

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటోన్న వారి శాతం మరింత పెరిగింది. 38.78 శాతానికి పెరిగింది. గడచిన 24 గంటల్లో 2350 మంది కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య 39, 174కు చేరింది. రికవరీ రేట్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇలా ఉండగా పంజాబ్‌లో రికవరీ రేటు 64 శాతం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో తమ రాష్ట్రంలో మాత్రమే ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదైందని పంజాబ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు తెలిపారు. పంజాబ్‌లో ఇప్పటివరకూ 1980 కేసులు నమోదయ్యాయి. 1547 మంది కోలుకున్నారు.

భారత్‌లో ఇప్పటివరకూ 101,261 మందికి కరోనా సోకింది. 3,163 మంది చనిపోయారు.

Comments

Popular posts from this blog

Crypto Newbies Have Family And Friends To Thank For Losses

అపర కుబేరుడు అదానీ

Reliance Jio Tops 5G Spectrum Bids With ₹ 88,078 Crore,